KRNL: ప్రభుత్వ ఆదేశాలతో ఆదోని డివిజన్ అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాట్లు చేసినట్లు శుక్రవారం ఇన్చార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. భూ రికార్డులకు సంబంధించి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు క్యాంపులు ఏర్పాటు చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న పట్టాలు, వెబ్లాండ్ రికార్డుల్లో ప్రభుత్వ భూముల సమస్యను పరిష్కరిస్తున్నారు.