WG: వంగవీటి మోహన రంగా వర్ధంతి పురస్కరించుకుని శుక్రవారం తణుకులో వైసీపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద రంగా విగ్రహానికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం ఆయన పాటుపడ్డారని ఈ సందర్భంగా కారుమూరి కొనియాడారు.