సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ద.మ. రైల్వే కీలక ప్రకటన చేసింది. కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, మచిలీపట్నం మార్గంలో 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక సర్వీసులలో 2 రైళ్లు కాకినాడ-సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో 2 రైళ్లు నాందేడ్-కాకినాడ మార్గంలో, మిగిలిన 2 రైళ్లు మచిలీపట్నం-వికారాబాద్ మధ్య నడుస్తాయి.