GNTR: తెనాలిలోని వైకుంటపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు శుక్రవారం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారు శ్రీ రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో ఉన్న స్వామి వారికి పూజలు నిర్వహించి గ్రామోత్సవం జరిపారు.