JGL: గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ అభివృద్ధి కోసం , న్యాయవాది పాదం తిరుపతి రూ. 50 వేల చెక్కును విరాళంగా అందించారు. గ్రామ సర్పంచ్ ముదాం గౌతమి ప్రమాణ స్వీకారం చేయగా తిరుపతి తల్లిదండ్రులు పాదం రాజవ్వ – రాజయ్యల జ్ఞాపకార్థం చెక్కును నూతన పాలకవర్గానికి అందించారు. రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఐలయ్య పాల్గొన్నారు.