బాపట్లలో దొంగలు కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్నారు. పట్టణంలో గురువారం అర్ధరాత్రి విన్నకోట వారి వీధిలో గల దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. దుకాణం తాళం ధ్వంసం చేసి చోరీ చేశారన్నారు. షాపులో ఎక్కువ మొత్తంలో నగదు లేకపోవడంతో నష్టం తక్కువ వాటిలిందన్నారు. పట్టణంలో జరుగుతున్న దొంగతనాలను పోలీసులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.