E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో గ్రాండ్ కార్నివాల్ నిర్వహించనున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సుబ్రహ్మణ్యం మైదానంలో ఫుడ్, మ్యూజిక్, ఫన్ థీమ్‌తో వేడుకలు జరగనున్నాయి. మ్యూజికల్ ఈవెంట్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్, సెల్ఫీ బూత్‌లు ఏర్పాటు చేస్తామని, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.