HYD: NIMS ఆస్పత్రిలో తాగునీటి వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని రోగులు, వారి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఆరు దశల శుద్ధి కలిగిన వాటర్ ఏటీఎంలు ప్రస్తుతం నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వాటర్ ఏటీఎంల వద్ద దుర్గంధం నెలకొందని, ఆ నీరు తాగితే రోగాల బారిన పడాల్సి వస్తుందన్నారు.