SKLM: ధనుర్మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమదాలవలసలో హరిదాసుల సందడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. తెల్లవారుజాము నుంచే హరిదాసులు ఇంటింటా తిరుగుతూ గోవింద నామస్మరణ, భజనలు ఆలపించారు. వారి మధుర స్వరాలు, తంబుర ధ్వనులు భక్తులను ఆకట్టుకున్నాయి. ధనుర్మాసం అనేది భక్తి, నియమాలు, ఆధ్యాత్మిక సాధనకు విశేష ప్రాధాన్యం కలిగిన మాసంగా భావిస్తారు.