PDPL: జూలపల్లిలో CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను గుర్తించి బాధితుడికి జూలపల్లి పోలీసులు అందజేశారు. గ్మారం అశోక్ అనే వ్యక్తి ఫోన్ ఇటీవల పోయింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆ ఫోన్ ఆచూకీని కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్లో బాధితుడికి ఫోన్ను అందజేశారు.