PDPL: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌ను గురువారం స్వతంత్ర డైరెక్టర్ల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం ఎన్టీపీసీ రిజర్వాయర్‌లోని 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను, 7వ యూనిట్‌ను సందర్శించి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు.