ATP: గుంతకల్లు పట్టణంలోని అతి పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం పుష్యమాసం సందర్భంగా శివునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో శివునికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ అర్చకుడు మాట్లాడుతూ.. ఈ మాసంలో పితృదేవతలను పూజించడం, తర్పణాలు చేయడం మంచిదన్నారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.