AP: తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్ల జారీని TTD రద్దు చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ టికెట్ల జారీని నిలిపివేసింది. ఇప్పటికే ఈనెల 30 నుంచి జనవరి 1 వరకు వీటిని రద్దు చేయగా, జనవరి 2 నుంచి 8 వరకు ఉన్న టికెట్ల ఆన్లైన్ విక్రయాలు పూర్తయ్యాయి. తిరిగి జనవరి 9న శ్రీవాణి దర్శన టికెట్లను పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.