KDP: చక్రాయిపేట మండలంలోని గండి క్షేత్రంలో వెలిసి ఉన్న ఆంజనేయస్వామి సన్నిధానంలో శుక్రవారం నుంచి సుందరకాండ ప్రవచనం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. హైదరాబాదుకు చెందిన ప్రవచనకర్త దత్త శర్మచే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శుక్ర, శని, ఆదివారాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు వాల్మీకి మహర్షి విరచిత సుందరకాండ ప్రవచనం ఉంటుందని పేర్కొన్నారు.