PDPL: ప్రజల సమస్యలను సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హామీ ఇచ్చారు. రామగుండంలోని నూతన 55వ డివిజన్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్తూ స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.