ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు ఈ దాడికి పాల్పడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు మే 7 ఉదయం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి.