E.G: కోరుకొండ మండలంలో ఇవాళ దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుంచి మంచు కురవడంతో కూలీలు దారి కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధిక మంచు వల్ల మామిడి, జీడి మామిడి తోటల్లో పూత, పిందె దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెసర, మినుము పంటలకు కూడా నష్టం వాటిల్లుతుందని, పెట్టిన పెట్టుబడులు కోల్పోతామని తోటల యజమానులు వాపోతున్నారు.