అనకాపల్లి జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల అవగాహన నాటికోత్సవాలు నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జోగినాయుడు, కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం బ్రోచర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ మహతి క్రియేషన్స్ జార్జ్ క్లబ్ సంయుక్తంగా ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.