JGL: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామ రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించేలా చూడాలని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జాతీయ రహదారి 63 విస్తరణలో గ్రామంలో కబ్జాలో ఉన్న రైతుల పేర్లు రాకుండా, ఓనర్ నాట్ ఐడెంటిఫైడ్ అని రావడంతో, తమకు అన్యాయం జరిగిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే ఆర్డీవో మధుసూదన్ కలిసి సమస్యను వివరించారు.