BHPL: గ్రామ సమాఖ్యలకు సొంత భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 248 పంచాయతీల్లో రూ.24.80 కోట్లు నిధులతో నిర్మాణాలు చేపడతారు. ఒక్క గ్రామ సమాఖ్య భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. 200 గజాల స్థలంలో నిర్మిస్తారు.