WG: ఉండి మండలంలో యూరియా నిల్వలకు సంబంధించి సొసైటీలో 100 టన్నులు, ప్రైవేటు దుకాణాల్లో 125 టన్నులు ఉన్నాయిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ డాక్టర్ నిమ్మల శ్రీనివాసరావు తెలిపారు. రైతు సేవా కేంద్రంలో మరో 25 టన్నులుతో కలసి మొత్తం 250 టన్నుల వరకు నిల్వ ఉన్నట్టు ఆయన తెలిపారు. యూరియా కోసం ఏ రైతు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. మండలంలో పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.