TG: BRS అధినేత, మాజీ సీఎం KCR ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నేతలు అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రభుత్వ వైఫాల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీని బలోపేతం చేసేందుకు నిర్వహించాల్సిన బహిరంగ సభలపై గులాబీ బాస్ చర్చించనున్నారు.