SRPT: కోదాడ పట్టణానికి చెందిన రాజేష్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల వేధింపుల కారణంగానే రాజేష్ మృతి చెందారు అన్న ఆరోపణ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది. నేడు విచారణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కోదాడ సీఐ, చిలుకూరు ఎస్సైలను సస్పెండ్ చేశారు.