MBNR: వేముల గ్రామంలో జరిగిన దళిత యువతి ప్రవళిక అత్యాచారం హత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కెవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. గురువారం ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలిపారు.