విశాఖ జీవీఎంసీ 5వ వార్డు పరిధిలోని సాయిరాం కాలనీలో సుమారు రూ.16 లక్షల వ్యయంతో కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులకు కార్పొరేటర్ మొల్లి హేమలత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహకారంతో వార్డులో రోడ్లు, కాలువల పనులను కూడా త్వరలో పూర్తిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.