AP: గుంటూరు జిల్లా నల్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆగి ఉన్న కారును ప్రైవేట్ టావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగ్గా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మరణించినవారిని తెలంగాణ సూర్యాపేట ప్రాంతవాసులుగా గుర్తించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.