HYD జలమండలి పరిధిలో గల ట్యాంకర్ డ్రైవర్లు క్యాన్ నెంబర్ను ఆసరాగా చేసుకుని అక్రమంగా ట్యాంకర్లు బుకింగ్ చేస్తున్నట్లు HMWSSB గుర్తించింది. నిఘా సమయంలో ఓ డ్రైవర్ ఏకంగా 9 ట్యాంకర్లు బుక్ చేసినట్లు తేలింది. సబ్సిడీ రేట్లతో నీటిని హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నట్లు నిర్ధారించి సంబంధిత క్యాన్ నెంబర్ను బ్లాక్ చేశారు.