WGL: సంగెం మండలం తీగరాజుపల్లి నుండి గీసుకొండ వైపు అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు SI వంశీకృష్ణ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ శ్రవణ్, అమీర్ రాత్రి దాడులు చేపట్టగా.. అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి.. లారీని పోలీస్ స్టేషన్కకు తరలించారు.