HYD: నగరంలోని కృష్ణా ఫేజ్-1 పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఈనెల 28 సాయంత్రం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. ముఖ్యంగా ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, సైదాబాద్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, చిల్కల్గూడ, తుక్కుగూడ వంటి ప్రాంతాలపై ఈ ప్రభావం ఉంటుంది.