KNR: కరీంనగర్ మద్యం డిపోలో ఓ ఎక్సైజ్ అధికారి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఉన్నత అధికారులు దృష్టి సారించారు. ఒక్కో మద్యం దుకాణానికి ఎంట్రీ ఫీజు రూ.4,000, నెలవారీ ఫీజు రూ.900 చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్నారని నూతనంగా మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఆరోపించడంతో ఉన్నతాధికారుల దృష్టి పడింది. శాఖ పరమైన చర్యలకు రంగం సిద్ధమైంది.