కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా మచిలీపట్టణం (MTM)- వికారాబాద్ (VKB) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07454 MTM- VKB, నం. 07455 VKB- MTM రైళ్లు 2026 జనవరి 11,18న నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు మార్గమధ్యంలో విజయవాడ, గుడివాడ, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లితో పాటు పలు స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.