BHPL: గణపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 75 మందికి కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేయనున్నట్లు తహసిల్దార్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.