మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు మాజీ సర్పంచ్ నవ్య మద్దతు ప్రకటించారు. తమ దుస్తులు తమ ఇష్టం అంటున్న వారిపై ఆమె మండిపడ్డారు. ‘పశువులకు ఏమీ తెలియదు కాబట్టే అవి బట్టలు కట్టుకోవు. కానీ మనం కడుపుకు అన్నం తింటున్నాం, మనుషుల్లాగా బట్టలు కప్పుకోవాలి కానీ విప్పుకోకూడదు. బట్టలు విప్పుకునే మీలాంటి వారి వల్లే సమాజంలో మంచి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.