RR: బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. మహేశ్వరం PS పరిధి దెబ్బడిగూడకు చెందిన విక్రమ్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు అలవాటై సుమారు రూ. లక్ష నష్టపోయాడు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతుడి అన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.