NRPT: డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలు ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, కార్యక్రమాలను చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.