కృష్ణా: గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన గోపి నాగబాబుని పార్టీ నేతలు శాలువాతో గురువారం సన్మానించారు.ఈ సందర్భంగా గోపి నాగబాబు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని రాజేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొల్లా రాజేష్, జనసేన పార్టీ నాయకులు వన్నెంరెడ్డి సాయి కిరణ్, బొల్లా యశ్వంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.