మహబూబ్ నగర్ దసరా ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ రావు సతీమణి అరుణ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి వారి నివాసానికి చేరుకుని మురళీధర్ రావును పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ జనరల్ సెక్రెటరీ సిరాజ్ ఖాద్రి, నాయకులు గుండా మనోహర్ తదితరులు ఉన్నారు.