NTR: విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ గురువారం వత్సవాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, పనితీరుపై వారితో ముఖాముఖి చర్చించారు.