MNCL: విద్యార్థులు, యువత సన్మార్గంలో నడవాలని తాండూర్ మండలం మాదారం SI సౌజన్య అన్నారు. గురువారం భీమయ్య దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ని SI ప్రారంభించారు. SI మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.