MBNR: బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి వద్ద స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన అత్యంత విచారకరమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూల్ బస్సుల భద్రత, రహదారి నియమాల అమలుపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.