గద్వాల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తాను అని రాజీవ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్వాల జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. అటు పార్టీకి ఇటు ప్రజలకు విధేయుడుగా ఉంటానని పేర్కొన్నారు.