KNR: పశువుల్లో వ్యాధుల నివారణకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రూరల్ మండల పశు వైద్యాధికారి జ్యోత్స్న కోరారు. గురువారం దురిశేడులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.