NRML: కుంటాల మండలం అంబకంటి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి తెలిపారు. గురువారం భైంసాలోని తన కార్యాలయంలో గ్రామ సర్పంచ్ రాణి ప్రవీణ్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ఆయన అందజేశారు.