కృష్ణా: ఉమామహేశ్వరపురం శివారు ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు వీరవల్లి ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో కలిసి శిబిరంపై గురువారం దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 11,700, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.