JN: భువనగిరి పట్టణ కేంద్రంలోని MP క్యాంపు కార్యాలయంలో ఇవాళ MP చామల కిరణ్ కుమార్ రెడ్డిని తరిగొప్పుల గ్రామ నూతన సర్పంచ్ జ్యోతి, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MP నూతన సర్పంచును శాలువతో సన్మానించి.. శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి MP సహకరించాలని నూతన సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.