NTR: భక్తులకు అత్యుత్తమ సేవలు అందించే దేవాలయాల్లో దుర్గమ్మ ఆలయం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆన్లైన్ లావాదేవీల్లోనూ రికార్డు స్థాయి ఆదాయంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దసరా ఉత్సవాల్లో 20 లక్షల మందికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినందుకు ఈవో శీనా నాయక్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. భవానీ దీక్షల విరమణలోనూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించారు.