MDK: చేగుంట మండలంలో ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన బేదరమైన హరిబాబు (39) తన నివాసంలో మృతి చెందాడు. ఆర్థిక సమస్యలే కారణమని మృతుడి భార్య లత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.