కృష్ణ: మల్లవల్లి నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీ (ఐలా) నూతన కమిటీ సభ్యులు గురువారం విజయవాడలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును కలిశారు. పారిశ్రామికవాడలోని విద్యుత్ అంతరాయాలు, మౌలిక వసతుల సమస్యలను వివరించారు.ఎమ్మెల్యే స్పందిస్తూ విద్యుత్ సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చిస్తానని, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.