వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు గురువారం కడప నగరంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రైల్వే స్టేషన్, రైతు బజార్, బుగ్గవంక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో గంజాయి సరఫరా, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టి, అనుమానితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.