NZB: బాన్సువాడ పట్టణానికి చెందిన మంత్రి నాగమణి భర్త, కీర్తిశేషులు మంత్రి నర్సింలు కుమారుడు సుదర్శన్, హైదరాబాద్ బాలనగర్ సైబరాబాద్‌లో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. బాన్సువాడకు వచ్చిన ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. తాను ఇంటర్మీడియట్ వరకు బాన్సువాడలోనే విద్యాభ్యాసం చేశానని, పోలీసు శాఖలో ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.